calender_icon.png 13 March, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి

12-03-2025 09:54:22 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): మోడల్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గృహనిర్మాణం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటివరకు 19 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల మాడల్ గృహాలు గ్రౌండింగ్ చేయడం జరిగాయని, వాటి నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అట్టి నిర్మాణాల పనులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.  డోంగ్లి మండలంలో మాడల్ ఇంటి నిర్మాణాన్ని గ్రౌన్డింగ్ చేయాలని తెలిపారు.  ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే మార్కవుట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రావణ్ కుమార్, పంచాయతీ రాజ్, గృహనిర్మాణ శాఖల ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.