కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్,పరిశుభ్రమైన మరుగుదోడ్ల వివరాలు డిసెంబర్ 5లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మున్సిపల్,పంచాయతీ, రైల్వే తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాన్యువల్ స్కావేంజర్, ఇన్సానిటరీ టాయిలెట్స్ వివరాలు ప్రభుత్వానికి సమర్పించవలసి ఉందని, జిల్లాలోని పంచాయతీ, మున్సిపల్, రైల్వే పరిధిలో ఉన్నట్లయితే అట్టి వివరములు జిల్లా ఎస్పీసంక్షేమ అధికారి కార్యాలయంనకు డిసెంబర్ 5 లోగా సమర్పించాలని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, సీపీఓ రాజారాం, మున్సిపల్ డిప్యూటి ఈఈ వేణు గోపాల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.