calender_icon.png 19 January, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుకు యోగ్యం కానీ భూములను పరిశీలించాలి

18-01-2025 10:46:35 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించి వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. శనివారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని భూములను కలెక్టర్ పరిశీలించారు. క్యాసంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 330,331,332,333లలో గల 58 ఎకరాల భూములను పరిశీలించారు. ఇందులో 30 ఎకరాల భూమిని లే ఔట్ చేసి ఉందని, మిగతా 28 ఎకరాలు పంట సాగు(Crop Cultivation)లో ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్డీవో రంగనాథ్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, తహశీల్దార్ జనార్దన్, వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.