calender_icon.png 27 February, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

26-01-2025 04:03:19 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వ పథకాల(Government Schemes)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజ్ ఖాన్ పేట గ్రామం(Raj Khanpet Village)లో జరిగిన రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa), ఇందిరమ్మ ఇల్లు(Indiramma Indlu), రేషన్ కార్డు(New Ration Card)లు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. లబ్ధిదారులకు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను పంపిణీ చేశారు. రైతులకు రైతు భరోసా ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను ఆదివారం ప్రారంభించిందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్ ఖాన్ పేట గ్రామంలో 56 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇరువైడు మందికి రేషన్ కార్డులు 85 మందికి రైతు భరోసా 29 మందికి ఆత్మీయ రైతు భరోసా పథకాలు మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డిఓ రంగనాథరావు, మండల ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పౌర  సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, గృహ నిర్మాణ శాఖ పీడి విజయపాల్ రెడ్డి, ఎంపీడీవో నాగరాజు, తాసిల్దార్ శ్వేత, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్ నాయక్, నౌసీలాల్,  సదర్  నాయక్, పుల్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.