యాదాద్రిభువనగిరి,(విజయక్రాంతి): ఆలేరు పీహెచ్ సీని జిల్లా కలెక్టర్ హనుమంత రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటించని సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తంచేశారు. సిబ్బంది వివరాలు ,పేషంట్స్ ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటెండన్స్ రిజిస్టర్ ని పరిశీలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ కి షోకాస్ నోటీస్ జారీ చేశారు. విధులకు హాజరు కానీ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీధర్ , డాక్టర్ రజిని ,డాక్టర్ స్వప్న కి షోకాస్ నోటీస్ జారీ చేశారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.