calender_icon.png 23 March, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, డిఈవో

22-03-2025 09:36:39 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) శనివారం పరిశీలించారు. గర్మిళ్ళ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ట్రినిటీ ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణ కొరకు 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షకు 9,185 మంది హాజరు కావలసి ఉండగా 9,163 మంది విద్యార్థులు హాజరయ్యారని, గతంలో అనుత్తీర్ణులైన ముగ్గురికి, ఒక్కరు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా 99.74 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అధికారులు

పరీక్షల రాష్ట్ర పరిశీలకులు సత్యనారాయణరెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్ ను సందర్శించి ప్రశ్నాపత్రాల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం మంచిర్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, హాజీపూర్ లో ఒక స్కూల్, లక్షెట్టిపేటలో రెండు, దండేపల్లిలో రెండు, జన్నారంలో ఒక పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా విద్యాధికారి యాదయ్య మంచిర్యాలలో ఐదు, నస్పూర్ లో ఒక పరీక్షా కేంద్రాన్ని, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఒక పరీక్షా కేంద్రాన్ని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్షా కేంద్రాలను సందర్శించారు.