రైస్ మిల్లులో కలెక్టర్, సీపీ ఆకస్మిక తనిఖీ
బీహార్ కూలీలతో నేరుగా సంభాషణ..
కరీంనగర్,మే24(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాగంగాధర మండలం గట్టుబూత్కుర్ జానకిరామ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో రాత్రిజిల్లా కలెక్టర్ చిత్ర మిత్ర, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన వారు అక్కడ పనిచేస్తున్న బీహార్కు చెందిన వలస కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడారు.రోజుకు ఎంత కూలి వస్తోంది..? ఎక్కడి నుంచి వచ్చారు..? ఎన్ని గంటలు పనిచేస్తున్నారు..? అంటూ వారి పని పరిస్థితులు, కుటుంబ వివరాలు, వసతి, ఇతర ఇబ్బందులపై ఆరా తీశారు.
కూలీల నుంచి నేరుగా వివరాలు తెలుసుకుని వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.కేవలం పనుల పర్యవేక్షణకే పరిమితం కాకుండా, కూలీల జీవన పరిస్థితులపై కూడా అధికారులు దృష్టి సారించడం ప్రత్యేకంగా నిలిచింది. రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా జరగడానికి మరింత మందిని కూలీలను ఏర్పాటు చేసుకోవాలని రైస్ మిల్లర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ సీఐ ప్రదీప్ కుమార్ జిల్లా పౌరసరఫరాల అధిక నర్సింగరావు డిఎం రజనీకాంత్ స్థానిక అధికారులుపాల్గొన్నారు.






