వనపర్తి: యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా యువతకు కలెక్టర్ శుభాకంక్షలు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని తెలిపారు.
నషా ముక్త్ భారత్ కింద యువతను మాదక ద్రవ్యాల వినియోగం నుండి దూరంగా ఉంచేందుకు సమాజంలో అందరూ కృషి చేయాలని, యువత స్వయంగా సన్మార్గంలో నడిచే విధంగా ప్రతిజ్ఞ చేయించారు. అడిషనల్ ఎస్పీ ప్రతిజ్ఞ చేయించగా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం. నగేష్, అడిషనల్ ఎస్పీ తేజావత రామదాసు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.