calender_icon.png 26 November, 2024 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజుకు 40 ఏ.సి.కె లు ఇచ్చే విధంగా చూడాలి...

12-09-2024 01:21:38 PM

పౌర సరఫరాల శాఖ అధికారులతో బియ్యం  అప్పగింత పై సమీక్ష

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మిల్లర్లు ఇవ్వాల్సిన ధాన్యం రోజుకు 40 ఏ.సి. కె లు ఇచ్చే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. గురువారం కలక్టర్ ఛాంబర్ లో పౌర సరఫరాల శాఖ అధికారులతో బియ్యం  అప్పగింత పై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఏ రైస్ మిల్లు ఎంత ధాన్యం అప్పగించింది ఇంకా ఇవ్వాల్సిన ధాన్యం ఎంత అనే దానిపై మిల్లువారిగా సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికీ జిల్లా నుండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సివిల్ సప్లై శాఖకు ఇవ్వాల్సిన ధాన్యం చాలా పెండింగ్ ఉందని అందువల్ల వచ్చే 20 రోజులు రోజుకు 40 ఏ.సి.కే ల చొప్పున బియ్యం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డి.టి. లను ఆదేశించారు.  ఇందులో ఉప్పుడు బియ్యం రోజుకు 15 ఏ.సి. కె లు ఇచ్చెవిధంగా సివిల్ సప్లై అధికారి, డి.యం సివిల్ సప్లై బాధ్యతలు తీసుకోవాలని,  మిగిలిన 25 ఏ.సి.కే ల మూడి బియ్యం బాధ్యతలను ముగ్గురు డి.టి లకు అప్పగించారు. బియ్యం బాగా ఇచ్చే మిల్లులకు ప్రోత్సాహకం ఇవ్వడం జరుగుతుందని, ఇవ్వని రైస్ మిల్లులు బ్లాక్ లిస్టులో ఉంచడం జరుగుతుందన్నారు. సెలవుతో సంబంధం లేకుండా ప్రతి రోజూ 40 ఏ.సి. కె ల ధాన్యం ఎఫ్.సి.ఐ కి వెళ్ళేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం. షేక్ ఇర్ఫాన్, డి.టి.లు, తహసిల్దార్ మదన్ మోహన్ పాల్గొన్నారు.