calender_icon.png 22 April, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

21-04-2025 10:14:13 PM

బాసర,(విజయక్రాంతి): బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ సోమవారం బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం దేవస్థాన విశేషాలు కలెక్టర్‌కు వివరించారు. ఆలయ పరిసరాల్లో స్వచ్ఛత, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. భక్తుల సౌకర్యాల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్ డి ఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర తో పాటు దేవస్థాన సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.