27-02-2025 10:28:06 PM
పట్టభద్రులు 72.59
ఉపాధ్యాయులు 89.27
జిల్లా కలెక్టర్ వెల్లడి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శాసనమండలి ఓటింగ్ పూర్తయినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల సమయం ముగియగా. ఆ సమయానికి వరుసలో నిలబడి ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాలో 1282 మంది పురుష, 684 స్త్రీ ఉపాధ్యాయ ఓటర్లను కలుపుకొని మొత్తం 1966 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా వీరిలో 1146 మంది పురుష, 609 మంది స్త్రీ ఉపాధ్యాయ ఓటర్లు కలుపుకొని, 1755 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 89.27 గా నమోదయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 11497 పురుష, 5644 స్త్రీ ఓటర్లను కలుపుకొని మొత్తం 17141 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరిలో 8434 మంది పురుష, 4008 మంది స్త్రీ ఓటర్లను కలుపుకొని మొత్తం 12442 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 72.59 శాతం ఓటింగ్ నమోదయిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు