calender_icon.png 22 September, 2024 | 8:53 PM

ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

25-07-2024 06:13:53 PM

నిర్మల్: ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మండల, డివిజన్ స్థాయి  రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధరణి, ప్రభుత్వ స్థలాల రక్షణ, వివిధ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై, ధరణి దరఖాస్తుల పరిష్కారం, మండలాల వారీగా వివిధ దరఖాస్తులు, ఇప్పటివరకు పరిష్కరించినవి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ప్రభుత్వ స్థలాలు అక్రమణకు గురి కాకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రభుత్వ స్థలాలు చెరువు భూములను కబ్జా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన దృశ్య విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు వెంటనే జారీ చేయాలని, అలాగే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందజేయాలని సూచించారు. ధరణి దరఖాస్తులు, వివిధ మాడ్యూల్స్, సెషన్స్, కోర్టు కేసులు తదితర అంశాలపై కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.