నిర్మల్,(విజయక్రాంతి): డిసెంబర్ 15,16వ తేదీల్లో నిర్మల్ జిల్లాలో నిర్వహించి గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 8080 మంది అభ్యర్థులు హాజరుకారున్నారని జిల్లా కేంద్రంలో 24 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీజీపీఎస్సీ నిబంధన మేరకు ప్రతి ఒక్క ఉద్యోగి నియమాలను పాటించాలని ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, పరీక్షల కోఆర్డినేటర్లు పీజీ రెడ్డి, రవి సిబ్బంది పాల్గొన్నారు.