22-02-2025 09:47:02 PM
మీట్ ది ప్రెస్ లో కలెక్టర్ వెల్లడి
నిర్మల్,(విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 19 1 0 7 ఉండగా గ్రాడియెట్లు 17141, ఉపాధ్యాయులు 19 66 ఉన్నారని నిర్మల్ లో 35 భైంసా లో 11 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందని అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును నమోదు చేసుకొని 100% పోలింగ్కు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు పోలీసు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఈనెల 25 26 తేదీల్లో ఓటింగ్ విధానంపై కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు.