నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోను మండలం కడ్తాల్ వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్డు ప్రమాదాల నివారణ(Preventing Service Road Accidents) కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్(Additional Collector Kishore Kumar), జిల్లా అధికారులు ఉన్నారు.