calender_icon.png 19 January, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 20 లోపు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయండి

18-01-2025 08:00:48 PM

బైంసా,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా,, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల, ఆత్మీయ భరోసా పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ఈనెల 20 లోపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కుంటాల మండలం లింబా కె గ్రామంలో  చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు సర్వేను కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. సర్వేను లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయా గ్రామాల్లో తాసిల్దార్ ను ఎంపీడీవోలు ప్రత్యేక అధికారులు గ్రామ సభలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అనంతరం కుంటాల మండలంలోని పశు వైద్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి రోగులతో మాట్లాడారు. రోగులకు పశువులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డిఓ కోమల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, డిపిఓ శ్రీనివాస్, ఏడిఏ అంజి ప్రసాద్డిఎస్ఓ కిరణ్ కుమార్ అధికారులు ఉన్నారు.