సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం వచ్చిన దరఖాస్తుల సర్వే ప్రక్రియను త్వరగా పూర్తిచేసి గ్రామ సభలకు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయం నుండి అన్ని మండలాల అధికారులతో వీడియోకాన్ లో మాట్లాడారు. పెట్టుబడి సాయం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఎంపిక అత్యంత నిరుపేదలకు చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి 21 నుండి గ్రామసభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్, జిల్లా అధికారులు కిరణ్ కుమార్ విజయలక్ష్మి అంజి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.