మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసి సమాజాభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్, రాజ్ గౌడ్ సేవా సమితి భవనంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసి నాయకులు ఆదివాసీలు నెలకొంటున్న సమస్యలపై మాట్లాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజన గ్రామాలలో టైగర్ కారిడార్ తో ఏర్పడే ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఆదివాసీలో ఎదుర్కొంటున్న ప్రధానమైన పోడు భూముల సమస్యల విషయంలో ఆటవి, రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు.
విద్యాపరంగా ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, గిరిజన గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లేందుకు రాయి సెంటర్ లు కీలకంగా వివరించాలని సూచించారు. క్షేత్రస్థాయి నుండి ఆదివాసులు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో గోండ్వానా జాతీయ నాయకుడు సిడం అర్జున్ మాస్టర్, జిల్లా సర్మేడి మోతిరామ్, రాజ్ గొండ్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందుర్తి సుధాకర్, జిల్లా కార్యదర్శి నరసింగరావు, నాయకులు జ్ఞానేశ్వర్, యశ్వంత్ రావ్, శంకర్ భీమ్రావు, సెంటర్ల సర్మేడీలు పాల్గొన్నారు.