calender_icon.png 18 January, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్ నిధి సుస్థిరతకు సమష్టిగా కృషి

17-01-2025 08:04:02 PM

బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్.... 

మణుగూరు (విజయక్రాంతి): పింఛన్ దారుల సంక్షేమం దృష్ట్యా పింఛన్ నిధి సుస్థిరతకు సమష్టిగా కృషి చేయాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్(Union Coal Ministry Secretary Vikram Dev Dutt) అన్నారు. హైదరాబాద్ లో శుక్రవారం సీఎంపీఎఫ్(CMPF) 183వ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశం సింగరేణి భవన్ నందు తొలిసారిగా కోల్ మైన్స్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ 183వ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశం నిర్వహించారు. సమావేశంలో  పింఛన్ దారుల సంక్షేమం, పింఛన్ నిధి సుస్థిరతలపై చర్చించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, సీఎంపీఎఫ్ అధికారులు, బొగ్గు  కంపెనీల ప్రతినిధులు ఆలోచనలను పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ దేవదత్ మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి ద్వారా దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం కోసం సీఎంపీఎఫ్ ద్వారా సేవల అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

పింఛన్ సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు, కార్మికులకు పింఛన్ భద్రతను కల్పించడంపై విస్తృతంగా చర్చించారు. పింఛన్ నిధిని ఆర్థికంగా పరిపుష్టి పరచడం, పింఛన్ నిధిని అత్యంత పారదర్శకంగా తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్(Ministry of Coal Additional Secretary Mrs. Rupinder Brar), సంయుక్త కార్యదర్శి, ఫైనాన్సియల్ సలహాదారు మిస్ నిరుపమా కొట్రూ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి సంతోష్, సీఎంపీఎఫ్ కమిషనర్ విజయ్ కుమార్ మిశ్రా, యూనియన్ల నాయకులు, బోర్డు ఆఫ్ ట్రస్టీలు రామేంద్ర కుమార్, కె.లక్ష్మారెడ్డి, డిడి.రామానందన్, రాకేశ్ కుమార్, ఆశీశ్ క్రిష్ణ మూర్తి, డి.ఎన్.సింగ్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఎస్ఈసీఎల్ సీఎండీ డాక్టర్ ప్రేమ్ సాగర్ మిశ్రా, కోలిండియా డైరెక్టర్(పర్సనల్) డాక్టర్ వినయ్ రంజన్, డైరెక్టర్ (ఫైనాన్స్) ముకేశ్ అగర్వాల్, సింగరేణి డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు, జి.వెంకటేశ్వరరెడ్డి, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్.డి.ఎం.సుభానీ, జీఎం (వెల్ఫేర్) శ్రీనివాసరావు, సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరి పచౌరి తదితరులు పాల్గొన్నారు.