- కేసుల్లో రాజీ కుదుర్చుతామంటూ ఎర
- అన్నీ తామై వ్యవహరిస్తున్న కొందరు పోలీసులు
- ఇప్పటికే ఓ కోర్టు కానిస్టేబుల్ సస్పెండ్
- అయినా తీరు మారని వైనం
జగిత్యాల అర్బన్, జనవరి 18 (విజయక్రాంతి) : వివాదాల మూలంగా ఫిర్యాదులు చేసుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వారి అవసరాన్ని, కొందరు తమకు అంది వచ్చిన అవకాశంగా మార్చుకుం టున్న తీరిది. రాజీ కుదిర్చే క్రమంలో అన్నీ తామై వ్యవహరిస్తూ, అందినంతగా దండుకుంటున్న వైనమిది.
ఈ విషయం వివాదాస్పదమై ఉన్నతాధికారులకు తెలిసి, శాఖా పరమైన చర్యలు చేపట్టినప్పటికీ పోలీస్ శాఖలో కొందరి తీరు మారడం లేదు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో కొన్ని నెలల క్రితం నమోదైన కేసు విషయంలో ఫిర్యాదు దారుడు లేకుండానే రాజీ కుదర్చడం వివాదంగా మారింది.
ఈ ఘటనలో నిందితుడు ఇతర దేశానికి వెళ్లే క్రమంలో, కేసు రాజీ కుదుర్చాలని సదరు కోర్టు కానిస్టేబుల్తో డీల్ కుదర్చుకున్నాడు. దీంతో ఏకంగా ఫిర్యాదు దారుడు లేకుండానే రాజీ కుదిరింది. ఆన్లున్లో కేసు వివరాలు తెలుసుకున్న బాధితుడు పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందులో సదరు కోర్టు పీసీపై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే జిల్లా పోలీస్ శాఖలో కొందరు ఆఫీస ర్లు, సిబ్బంది తీరు వివాద స్పదంగా మారింది. పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసే కొందరు కోర్టు పీసీల వ్యవహర శైలీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లు వెత్తున్నాయి.
కొన్ని కేసు ల్లో అన్నీ తామై వ్యవహ రిస్తూ, కాసుల దందాకు తెర తీయడంపై ఆ శాఖ ఉన్నతా ధికారులు సీరియస్’గా తీసుకున్నారు. కొందరు ఆఫీసర్లు, సిబ్బంది పని తీరుపై నిఘా పెట్టి దిద్దుబాటు చర్యలకు రంగం సిద్దమైనట్లు వినిపిస్తోంది.
కాసుల వసూళ్లు...
వివిధ కేసుల్లో రాజీ కుదుర్చుకుంటున్న ఇరు వర్గాల నుండి కొందరు కోర్టు పీసీలు అందినంత దండుకుంటున్నారనే ఆరోపణ లున్నాయి. ఆయా కేసుల్లో వారు అన్నీ తామై వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నా యి. రాజీ కుదుర్చునేందుకు వీలుండే కేసులైన గాయా లు, బలమైన గాయాలు, అక్సిడెంట్, వరకట్నం, చీటింగ్, దొంగతనం వంటి కేసుల్లో ఫిర్యా దు దారులతో నిందితుడు రాజీ పడుతుంటాడు.
వీటి తో పాటు పోలీసులు సుమోటాగా నమోదు చేసిన ఇసుక అక్రమ రవాణా, ఇతర కేసుల్లోనూ చాలన్స్ కట్టిస్తూ రాజీ చేయిస్తున్న కేసుల్లో ఆఫీసర్ల తీరుపై సైతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు న్నాయి. ఈ కేసుల్లో తీవ్రతను బట్టి కొంద రు కోర్టు పీసీలు వసూళ్లకు పాల్పడు తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2626 ఎఫ్‌ఐఆర్ కేసులు రాజీ..
జగిత్యాల జిల్లాలో జరిగిన లోక్ అదాల త్లో 2626 ఎఫ్‌ఐఆర్ కేసులు, 1383 పెట్టీ కేసులు, 6881 ఎంవీ యాక్ట్ కేసులు డిస్పోజ్ అయ్యాయి. కానీ కొన్ని కేసుల్లో కొందరు పోలీసులు అక్రమాలకు తెర లేపి, అందినంత దండుకున్నట్లు బహిరంగం గానే ఆరోపణలున్నాయి. ఈ తంతు పై జిల్లా పోలీస్ ఆఫీసర్లు సీరియస్గా తీసుకున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఓ పీసీపై కేసు నమోదు చేయగా, సీఎంసీలో (కోర్టు మానిటరింగ్ టీం) పనిచేసే ఆఫీస ర్లు, సిబ్బందిపై బదిలీ వేటు పడింది. అయి తే వీరితోపాటు కొన్నిచోట్ల అవినీతి ఆరోప ణలున్న పోలీసులపైనా అధికారులు శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జిల్లా పోలీస్ శాఖలో దిద్దుబాటుపై మరింత దృష్టి సారించి, కొందరి చేతివాటంపై మరింత కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.