calender_icon.png 4 March, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్ ఆఫీసులో వసూళ్ల పర్వం

04-03-2025 01:08:13 AM

ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ జిల్లా సభ రిజిస్ట్రార్ శ్రీరామరాజు 

నిజామాబాద్ మార్చి 3: (విజయక్రాంతి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కార్యాలయంలో అవినీతి అడ్డువదుపు లేకుండా సాగుతోంది. సబ్ రిజిస్టర్లు ఆగడాలకు అంతే లేకుండా పోతుంది డబ్బులు ఇవ్వనిదే ఏ పని చేయడం లేదు డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తుల ద్వారా ఒక్కో రిజిస్ట్రేషన్  కు అన్ని డాక్యుమెంట్లు  సక్రమంగా ఉన్నప్పటికీని ఆస్తులకు సరిపడా చాలానా కట్టినప్పటికీని ఏదో ఒక సాకుతో రిజిస్ట్రేషన్లు పెండింగ్ పెట్టి.

డాక్యుమెంట్ విలువను బట్టి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు అడిగినంత ఇవ్వకపోతే ఊహకందని కొర్రీలు పెడుతున్నారు దరఖాస్తుదారాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా సోమవారం ఉదయం నిజామాబాద్ కార్యాలయంలోని సబ్ రిజిస్టర్ జాయింట్ -%॥% శ్రీరామరాజు ఏసీబీకు పట్టుబడిన సంఘటన రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల్లో కలకలం రేపింది.

ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై మొదటి నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఒక్కో డాక్యుమెంట్ ను రిజిస్ట్రేషన్ చేయడానికి రేట్ ఫిక్స్ చేసి మరీ వస్తువులకు పాల్పడుతున్నారు డబ్బులు ఇవ్వని రిజిస్ట్రేషన్ కక్షిదారులను రోజుల తరబడి తిప్పుతూ వారిని ఇబ్బందుల గురి చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఇది వస్తువుల కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా డాక్యుమెంట్ రైటర్ లో నుంచి రోజు వారిగా డబ్బులు వసూలు చేస్తున్నారు తిరిగి సబ్ రిజిస్టర్ కు అప్పగిస్తే వసూల్ అయిందంతా కుప్పేసి మరి పాళ్ళు పంచుకుంటున్నారు. ఈ తతంగం అంతా బహిరంగంగానే జరుగుతుంది తన అంటే తందాన అనడానికి డాక్యుమెంట్ రైటర్లు అందుబాటులో ఉంటున్నారు డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్ సిబ్బంది కలిసి రిజిస్ట్రేషన్ కు వచ్చే వారి నుండి డబ్బులు దండుకుంటున్నారు. 

అర్బన్ కార్యాలయంలో పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు సొంతగా డాక్యుమెంట్లు తయారు చేస్తూ ఆయనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయడం చర్చల్లో నిలిచింది సాధారణంగా అన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజులు పూర్తిచేసి సబ్ రిజిస్టార్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తున్నారు.

కానీ అందుకు భిన్నంగా శ్రీరామరాజు తన కార్యాలయంలోనే డాక్యుమెంట్ల కోసం వచ్చిన వారితో నేరుగా అటా లోకి వెళ్లి తానే డాక్యుమెంట్ తయారు చేయిస్తానని చెప్పి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నా తున్నట్టు అతను ఏసీబీలో 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడదామో తో స్పష్టమవుతోంది.గతంలో డాక్యుమెంట్ రైటర్లు 25 రోజులకు పైగా తమ నిరసన తెలిపారు రిజిస్ట్రేషన్లకు ఎలాంటి డాక్యుమెంట్లు పంపలేదు.

విషయం ఏమిటంటే ఆరా తీసిన మీడియాకి రిజిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని రిజిస్ట్రేషన్ల పరిధి దాటి వచ్చిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేస్తున్నామని సదరు శ్రీరామరాజు సెలవు ఇచ్చారు. తీరా రిజిస్ట్రేషన్ కు వచ్చిన డాక్యుమెంట్ తాలూకు వారి నుండి 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు

నిజామాబాద్ మార్చి 3 (విజయ క్రాంతి) : నిజాంబాద్ సబ్ రిజిస్టర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్‌లో గల జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామరాజు ఏసీబీకి చిక్కారు నిజామాబాద్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండో సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు శ్రీరామరాజు. 

గత కొద్ది రోజులుగా సబ్ రిజిస్టర్ లపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కు వచ్చిన డాక్యుమెంట్ తాలూకు వారి నుండి 10 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ అవినీతి నిరోధక శాఖ డిఎస్పి డి.ఎస్.పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నగదుతో పట్టుకున్నారు..