calender_icon.png 19 April, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లు శాంపిల్స్ సేకరణ

14-04-2025 01:34:27 AM

కామారెడ్డి, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో కృత్తిమ కల్తీకల్లును అరికట్టడంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాల్లో డిపోల్లో ఆదివారం కల్లు షాంపిల్స్ను సేకరించడం వేగవంతం చేశారు. జిల్లాలో ఎక్సైజ్ సిబ్బంది అప్రమత్తమైంది. టి ఎఫ్ టి లేని కల్లు దుకాణాలు మూసి ఉంచారు. ఎల్లారెడ్డి, దోమకొండ, బాన్సువాడ, సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో అన్ని కల్లు దుకాణాల్లో శాంపిల్స్ను సేకరించడం జరుగుతుంది.

మూడు రోజుల క్రితం జిల్లాలో 100 మంది కి పైగా కృత్రిమ కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించడంఎక్సైజ్ అధికారులు ప్రాణ నష్టం జరగకుండా చూశారు. కృత్తిమ కల్తీకల్లు నివారించడానికి తగు చర్యలు తక్షణమే చేపట్టాలని శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.

దీంతో ఎక్సైజ్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కృత్రిమ కల్తీ కల్లు పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. అవసరమైతే పీడి యాక్ట్ కింద కేసులు నమోదుచేసి కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.   శనివారం దోమకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కల్లు డిపోకు సీల్ వేశారు.