calender_icon.png 11 January, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆజాంజహీ భూముల రక్షణకు సంతకాల సేకరణ

11-01-2025 01:30:35 AM

జనగామ, జనవరి 10 (విజయక్రాంతి): వరంగల్‌లోని ఆజాంజహీ మిల్లుకు సంబంధించిన కార్మిక భ  స్థల పరిరక్షణ కోసం శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, వరంగల్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తొలి సంతకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ అండదం  ఆజాంజహీ మిల్లుకు సంబంధించిన స్థలాన్ని కొందరు బడా వ్యాపారవేత్తలు కబ్జా చేసి నిర్మాణా  చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మిక భవన్ కోసం ఆ స్థలాన్ని కేటాయించగా.. సొంత డబ్బులతో భవనం కట్టిస్తామని మం  కొండా సురేఖ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, బీజేపీ నాయకులు క ఉసుమ సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, కనుకుంట రంజిత్, హరిశంకర్ తదిత నూలు పాల్గొన్నారు.