calender_icon.png 10 January, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

QR కోడ్ ద్వారా ఫిర్యాదుదారుల ఫీడ్ బ్యాక్ సేకరణ

09-01-2025 11:01:45 PM

జిల్లా ఎస్పీ సింధు శర్మ...

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం క్యూఆర్ కోడ్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో క్యూఆర్ కోడ్ వాల్ పోస్టర్ సంబందించిన ప్రాధాన్యతను వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ పోలీస్ సిటిజెన్ ఫీడ్ బ్యాక్ పోస్టర్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీస్ సేవలపై జిల్లా ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది. ఈరోజు ఆవిష్కరణ జరిగిన పోస్టర్ నందు QR కోడ్ ను స్కాన్ చేసి లింక్ (https://qr.me-qr.com/aZMTxHDm) ఓపెన్ చేసి అందులో తెలుపబడిన విధంగా.... 

1) ఫిర్యాదులు 2) ఎఫ్.ఐ.ఆర్ 3)ఈ-చలాన్ (ట్రాఫిక్ ఉల్లాంఘనలు) 4) పాస్ పోర్ట్ ధ్రువీకరణ 5) ఇతర అంశాలపై ప్రజలు పోలీసు సేవల పట్ల తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈ క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లలో ప్రజలకు సులభంగా కనిపించే విధంగా రిసెప్షన్ సెంటర్, స్టేషన్ హౌస్ అధికారి రూమ్ నందు, ప్రజలు వేచి ఉండే గది నందు, బయటి ప్రవేశ ద్వారం వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజల వారి వారి అభిప్రాయాలు తెలియజేయాలని జిల్లా ఎస్పీ తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చైతన్య రెడ్డి ఐపీఎస్, ఏఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు, సిఐ జార్జ్, సిబ్బంది పాల్గొన్నారు.