- ఎనమిదేళ్లుగా అక్కడే తిష్టవేసిన అధికారి
- ఉన్నతాధికారి ములాకత్‌కు పైసలు ఇవ్వాలె
- అవినీతిపరుల చిట్టాతో అక్రమార్జన
- జీతం 60వేలు.. కోట్లకు పడగలెత్తిన వైనం
నాగర్‌కర్నూల్, ఆగస్టు 27 (విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్‌లో కలెక్షన్ కింగ్ తిష్ట వేశాడు. గత ఎనిమిదేళ్లుగా అక్కడే పాతుకుపోయాడు. అవినీతి అధికారుల భాగోతాలను గో ప్యంగా ఉంచుతూ వారినుండి ప్రతినెలా వసూళ్లకు పాల్పడుతూ కోట ్లకు పడగ లెత్తినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్య, వైద్య, ఆరోగ్యం, కార్పొరేషన్లు, అటవీ, మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ తదితరర శాఖ ల్లో నిత్యం పైరవీలు చేస్తూ వాటి నుంచి వాటాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల డిప్యూటేషన్‌లు, ఉన్నతాధికారి ములాకత్‌కు ధరలు నిర్ణయిస్తూ సంబురాలకు చిల్లర డబ్బులను కూడా వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం జరు గుతోంది. ఉన్నతాధికారులను సైతం బురిడీ కొట్టిస్తూ అటు అధికారికి, ఇటు ప్రజాప్రతినిధులు, వ్యాపారుల వద్ద మెప్పు పొందుతున్న ట్లు జోరుగా చర్చజరుగుతోంది.
2019లో తన సతీమణికి అనుకూలమైన స్థానానికి అప్పటి ఉన్నతాధికారి చేత డిప్యూటేషన్ ఆర్డర్‌లను తెప్పు ంచుకోవడం జిల్లా అధికారులనే ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో పాటు తన సోదరుడికి కూడా కలెక్టరేట్‌లోనే ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇలా కలెక్టరేట్‌లో తన పరపతి నడు స్తుండడంతో వయసులో పెద్దవారు, ఉన్నతస్థానంలో ఉన్న అధికారులు కూడా తన కు సలాం కొట్టాల్సిన పరిస్థతి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో శాఖలో జరిగే అవినీతి అక్రమాలను గోప్యంగా ఉంచేందుకు, తమ ఫైళ్ల పై త్వర గా సంతకాలు జరిగేందుకు ప్రతి శాఖ నుంచి నె లా నెలా మామూళ్లు వ సూళ్లు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుమారు ఎనిమిదేళ్లుగా ఉన్నతాధికారులు ఎందరు మారి నా తాను మాత్రం అదే కుర్చీలో తిష్టవేసుకుని కూర్చోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు పర్యాయాలు, అసెంబ్లీ, పార్లమె ంట్, మున్సిపల్, గ్రామపంచాయతీ తదితరల ఎన్నికలు జరిగినా ఆ స్థానంలో కొత్తవారు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్ర ధాన శాఖల అవినీతి అక్రమాలతో జిల్లా అభివృద్ధి కుంటు పడుతోందని పలువురు పేర్కొంటున్నారు.
చిరుద్యోగి నుంచి శాసంచే వరకు..
గత ఎనిమిదేళ్ల కిత్రం అతను ఓ మండల కార్యాలయంలో చిరుద్యోగి. ప్రతినెలా జీతం కోసం వేచిచూస్తూ కాలం గడిపేవాడు. తనకున్న పరిచయాలతో పైరవీలు చేసుకుని కం దనూలు కలెక్టరేట్‌లోని ఓ ఉన్నతాధికారి వద్ద స్థానం సం పాదించాడు. అప్పటినుంచి ఆ చిరుద్యోగి ఎనిమిదేళ్లుగా ఒకే కుర్చీలో తిష్టవేశాడు. జిల్లా ఉన్న తాధికారులు, ప్రజాప్రతి నిధులు, ఎమ్మెల్యేలు, వ్యాపారులను శాసి స్తూ అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తాడు. వారి అవినీతి చిట్టాను తన వద్దే ఉంచుకుని వాటి ఆసరగా అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి .
సెటిల్‌మెంట్స్ చేస్తున్నడు..
మొట్టమెదటి ఉన్నతాధికారి సమయంలోనే అన్ని శాఖల అధికారుల నుంచి మా మూళ్లు వసూలు చేసి వారు కోరుకున్న దగ్గరకు బదిలీలు జరిపించినట్లు ఆరోపణలు ఉ న్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా మారడంతో భూముల భారీగా ధరలు పెరగడంతో ప్రభుత్వ భూములను కూడా కబ్జాచేసినట్లు ఆయా శాఖల అధికారులు చర్చించుకుంటున్నారు. దీంతో పాటు కరోనా సమ యంలో, అనంతరం ధరణిలో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారం కోసం పెద్దమొత్తం లో సెటిల్మెంట్‌లు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నా యి. ఒకే స్థానం లో ఓ సాధారణ ఉద్యోగిని ఉ న్నతాధికారులు దీర్ఘకాలంగా పక్కనే ఉంచుకోవడంపై సర్వత్రా విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి.