11-02-2025 12:00:00 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : పారిశుధ్య నిర్వహణలో పలు అవార్డులు అందుకున్న మున్సిపాలిటిలో చెత్త సేకరణ‘చెత్త’గా ఉన్నది. ఏ వీది చూసిన చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. తడి, పొడి చెత్త వేయడానికి వేరువేరుగా డబ్బాలను ఏర్పాటు చేసిన వాటిని వినియోగించడంలో ప్రజల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, చెత్త సేకరించడంలో మున్సిపల్ శాఖ అలసత్వం వహిస్తున్నది.
ఎక్కడైతే వేయకూడదో...
ఇచ్చట చెత్త వేయరాదు అని ఎక్కడైతే గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉన్న దో అక్కడే నిర్బంయగా చెత్త పడవేస్తు న్నారు. ఊరికి మూల స్థలంగా పూజించే ‘బోడ్రాయి’ చుట్టూ కూడా విచ్చలవిడిగా చెత్త వేస్తున్నారంటే మున్సిపల్ అధికారుల పని తీరు అర్దం అవుతున్నది.
చెత్త బుట్టలు అందుబాటులో లేక.. ఉన్న వాటిని వాడక..
పట్టణంలో గత కొన్ని సంవత్సరాల క్రితం అధికంగా చెత్త వేసే ప్రాంతాలు, కూడళ్ళను గుర్తించి తడి, పొడి చెత్త సేకర ణకు వేరువేరుగా మున్సిపాలిటీ ఆద్వర్యం లో ప్లాస్టిక్ బుట్టలను ఏర్పాటు చేశారు. అందులో కొన్ని కనపడకుండా పోడా, ఉన్న వాటిని ప్రజలు వినియోగించడం లేదు. ప్రజలకు అవగహన కల్పించకపోవడం, చెత్త రోడ్డుపై వేస్తున్న వారిని గుర్తించి చర్య లు తీసుకోకపోవడంతో రోడ్లపై విచ్చల విడిగా చెత్తను పడేస్తున్నారని తెలుస్తుంది.