calender_icon.png 12 January, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులమంటూ డబ్బులు వసూలు

12-01-2025 12:00:00 AM

ఇద్దరి నిందితుల అరెస్టు

కరీంనగర్, జనవరి 11 (విజయక్రాంతి): హన్మకొండ జిల్లా కమలా పూర్ మండలం మాదన్నపేట గ్రా మానికి చెందిన మహమ్మద్ అజ్మత్ పాషా శుక్రవారం తన ఆటోలో నలుగురు పురోహితులను తీసుకుని వేములవాడ దర్శనానికి వచ్చారు. శనివారం తెల్లవారుజామున  3.30 గంటలకు తిరుగు ప్రయాణంలో కొత్తపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆసిఫ్ నగర్  వద్ద ఇద్దరు ఆటోను ఆపారు. తాము పోలీసులమంటూ వాహనానికి సంబంధించిన పత్రా లు చూపించాలని అడిగారు.

మొబై ల్‌లో ఉన్న పత్రాలను చూపించినప్పటికీ అవి సరిపోవని, భౌతికంగా లేనందున డబ్బులు చెల్లించాలని బెదరించారు. అనుమానం వచ్చిన బాధితుడు వారి ఐడెంటిటీ కార్డులు అడగగా అక్కడి నుంచి పారిపోయారు. తనకంటే ముందు ఆపిన వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపి నిందితులు చెక్రాల రాజు, గొట్టెముక్కల విజయ్‌ను అదుపులోకి తీసు కున్నారు.