calender_icon.png 9 January, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంనగర్‌లో కూలిన గోడ.... తప్పిన పెను ప్రమాదం..

09-01-2025 12:03:22 AM

గవర్నర్ ఇంటి వద్ద ఘటన..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రాంగనగర్‌లోని శ్రీనివాస షాపింగ్ మాల్ సమీపంలోని ఒక ఇంటి ప్రహారీ గోడ కుప్పకూలింది. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు చెందిన భవనాన్ని భారీ హిటాచీని ఉపయోగించి కొన్ని రోజుల నుండి కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం కూల్చివేతలు జరుగుతున్న సమయలో భారీ ప్రహారీ గోడ కుప్పకూలి పక్క ఇంటి గోడపై పడింది. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా గవర్నర్ బండారు దత్తాత్రేయకు చెందిన నాలుగు అంతస్తుల రెండు భవనాలను ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా గత కొన్ని రోజులుగా కూల్చివేస్తున్నారు. భారీ హిటాచీ ఉపయోగించి కూల్చివేతలు చేపడుతుండగా 20 ఫీట్ల గోడ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న మరో ఇంటి గోడపై పడిపోయింది. దీంతో కూల్చివేతలు చేపడుతున్న సిబ్బంది, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సుధాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సర్కిల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చివేతల తీరును పరిశీలించారు.