* ప్రమాదంలో ఇద్దరు మృతి
* కొనసాగుతున్న సహాయక చర్యలు
చండీగఢ్, డిసెంబర్ 22: పంజాబ్‌లోని మోహాలీలో మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఘటనలో ఇద్దరు మృతిచెందారు. స్థానికంగా కొత్తగా నిర్మించే బిల్డింగ్ కోసం శనివారం బేస్‌మెంట్ తవ్వకాలు జరుపుతుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల బిల్డింగ్ కూలింది. రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు అందిస్తున్నాయి. శిథిలాల కింద పదిమంది వరకు చిక్కుకుని ఉంటారని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురిని రక్షించామని, అత్యవసర ట్రీట్‌మెంట్ కోసం వారిని హాస్పిటల్‌కు తరలిం చినట్లు వెల్లడించారు. కూలిన బిల్డింగ్‌లో జిమ్ కూడా నడుపుతున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై బిల్డింగ్ యజమానులు పర్వీందర్ సింగ్, గగన్‌సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ విచారం వ్యక్తం చేశా రు. బాధితులకు మెరుగైన వైద్య అందించాలని ఆదేశించారు.