తప్పిన ప్రమాదం
హనుమకొండ, జూలై 12 (విజయక్రాంతి):: కాకతీయ వర్సిటీ (కేయూ)లో శుక్రవారం రాత్రి ఓ గది పైకప్పు పెచ్చులూడి కిందపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కేయూలోని పోతన హాస్టల్ పరిధిలోని 94వ గదిలో శుక్రవారం రాత్రి విద్యార్థినులు నిద్రిస్తున్నారు. ఈక్రమంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. దీంతో విద్యార్థినులు ఉలిక్కిపడి నిద్రలేచారు. ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవ ల ఇదే హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్ ఊడి విద్యార్థినిపై పడింది. ఘటనలో ఆమె గాయాలపాలైం ది. అది మరువకముందే మరోఘటన చోటుచేసుకోవడంపై విద్యార్థులు మండిపడుతు న్నారు. వరుసగా ఘటనలతో విద్యార్థులు ఆగ్రహానికి గురై కేయూలో ఆందోళన చేపట్టారు.