దంపతులకు గాయాలు
గజ్వేల్, నవంబర్ 24: గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో శనివారం అర్ధరాత్రి ఓ ఇంటిపైకప్పు కూలి ఇంట్లో పడుకున్న వారిపై పడింది. దీంతో భార్యభర్తలకు గాయాలయ్యా యి. గ్రామానికి చెందిన బక్కయల మహిపాల్ తన భార్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా పైకప్పు పెంకులు, మట్టి కూలి వారి మీదపడ్డాయి. శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు నిద్రలేచి చూడగా మహిపాల్ అతడి భార్య మట్టి, పెంకుల్లో కూరుకుపోయారు.
శిథిలాలను తొలగించి వారిని పైకి లేపారు. భార్యభర్తలిద్దిరికి గాయాలు కాగా, పిల్లలు వేరే గదిలో నిద్రిస్తుండటంతో వారికి దెబ్బలు తగలలేదు. ఉపాధి కోసం ముంబైకి వెళ్లిన మహిపాల్ కుటుంబం దసరా పండగకు గ్రామానికి వచ్చారు.