భయాందోళనలో స్థానికులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): నగరంలోని కొండాపూర్ సిద్దిఖ్నగర్లో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఓ ఐదం స్తుల భవనం పక్కకు ఒరగడంతో అందులో నివాసం ఉంటున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంతకారణంగా ఆ వైపున భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అక్కడకు చేరుకొని భవనంలో ఉంటున్నవారితో పాటు సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఏక్షణంలో అయినా భవనం కూలిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు అక్కడకి ఎవ్వరినీ వెళ్లకుండా పహారా కాస్తున్నారు.