1౨ మంది దుర్మరణం
30 మంది గల్లంతు
బీజింగ్, జూలై 20: చైనాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఓ రోడ్డు వంతెన కూలిపోవటంతో 11 మంది మరణించారు. 30 మంది గల్లంతయ్యారు. షాంగ్సి ప్రావిన్స్‌లోని ఝౌషు కౌంటీలో ఉన్న జాతీయ రహదారి జిన్‌క్వియాన్ నదిపై కొంతభాగం భారీ వరదలకు శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు నీటిలో పడి కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. గల్లంతైనవారిని వెదికేందుకు 18 పడవలు, 32 డ్రోన్లు, 76 వాహనాలతో 736 మంది విపత్తు నిర్వహణ సిబ్బంది పనిచేస్తున్నారని శనివారం వెల్లడించారు. నదిలో పడిన 5 వాహనాలను వెలికి తీశారు.