calender_icon.png 23 January, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకమేడలా కూలిన భవనం

23-10-2024 12:59:18 AM

బెంగళూరులో ఒకరు మృతి

బెంగళూరు, అక్టోబర్ 22: బెంగళూరులో మంగళవారం నిర్మాణం లో ఉన్న ఓ భవనం అమాంతం కూలిపోవటంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దాదాపు 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో హెన్నూ రు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం ఒకవైపు ఒరిగిపోయి క్షణాల్లోనే కూలిపోయింది. సమాచారం అందుకొన్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగాల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరిని ప్రాణాలతో కాపాడారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.