calender_icon.png 16 November, 2024 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార సేకరణకు సహకరించాలి

04-11-2024 01:24:32 AM

  1. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్
  2. బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ

ముషీరాబాద్, నవంబర్ 3 : రాష్ట్రంలో ఈనెల 6 నుంచి బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సమాచారాన్ని ఇంటిం టికి వచ్చి ఎన్యుమరేటర్ సేకరిస్తారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్  పి.నిరంజన్ అన్నారు. ఈ ప్రక్రియతో మొత్తం రాష్ట్ర జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంటుందో తెలిసిపోతుందని.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయ న అన్నారు.

ఈ మేరకు ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్ మాట్లాడుతూ.. గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్లుతై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఏఐఆర్‌ఆర్‌బీఈఏ జనరల్ సెక్రెటరీ ఎస్.వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీ ణ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఓబీసీ ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల విషయంలో ప్రగతిని సాధించామని,  ఉద్యోగు ల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. ఉద్యోగులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.

ఈ సమావేశానికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై.శోభ, ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మమ్మాయి మోహన్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. కరుణానిధి, వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నయ్య, ప్రెసిడెంట్ బి.రవికాంత్, టీఎస్ ఓబీసీ ఎం ప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి.దానకర్ణాచారి, జనరల్ మేనేజర్ టి.సుధాకర్, రిటైర్డ్ జీఎం పి.శ్రీనివాస్‌గౌడ్, ఎస్‌బీఐ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే.రాజు తదితరులు పాల్గొన్నారు.