calender_icon.png 7 November, 2024 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలిన్ మున్రో క్రికెట్‌కు గుడ్‌బై

11-05-2024 01:56:33 AM

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడు కొలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ బరిలో దిగే కివీస్ జట్టులో చోటు దక్కకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్రో తెలిపాడు. పొట్టి క్రికెట్‌లో చిచ్చరపిడుగుగా గుర్తింపు సాధించిన 37 ఏళ్ల మున్రో న్యూజిలాండ్ తరపున 65 టీ20లు, 57 వన్డేలు, ఒక టెస్టు ఆడాడు. టీ20ల్లో కివీస్ తరపున మూడు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా మున్రో నిలిచాడు. ఇక న్యూజిలాండ్ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతడు ఆరో స్థానంలో ఉన్నాడు. ‘బ్లాక్‌క్యాప్స్ తరపున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. మూడు ఫార్మాట్లు కలిపి 123 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జెర్సీ ధరించినందుకు నేను గర్వంతో ఉప్పొంగిపోవడం లేదు. 2024 టీ20 ప్రపంచకప్‌నకు జట్టులో చోటు దక్కుతుందని ఆశించా. కానీ నిరాశే ఎదురైంది. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా’ అని మున్రో ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.