బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): బంగాళాఖాతంవలో ఏర్పడిన వాయుగండం ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో చల్లటి గాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. తేలికపాటి వర్షాలు ఐదురోజుల పాటు ఉండొచ్చని పేర్కొన్నది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, గురువారం ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్‌పూర్‌లో గురువారం 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది ఇదేరోజు భీమ్‌పూర్‌లో 16.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 8.8 డిగ్రీలు సిర్పూర్, 9.4 డిగ్రీలు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, 9.5 డిగ్రీలు మెదక్ జిల్లా శివంపేట, 10.0 డిగ్రీలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదయ్యాయి