calender_icon.png 12 December, 2024 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న చలి

12-12-2024 10:43:58 AM

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తుంది. డిల్లీ, యూపీ, హరియాణా, పంజాబ్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ వెల్లడించింది. ఉదయం ఢిల్లీ సఫ్దర్ జంగ్ లో అత్యల్పంగా 4.5 డిగ్రీలు నమోదైంది. ఇవాళ గరిష్ఠంగా 16 డిగ్రీలు నమోదువుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. చలితీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం నిరాశ్రయులకు నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసింది. గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. బుధవారం, ఢిల్లీలో కనిష్టంగా 4.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.