calender_icon.png 5 January, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ సహా ఉత్తర భారత్ ను కమ్మేసిన పొగమంచు

03-01-2025 11:21:33 AM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. పలు రాష్ట్రాలను దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో గత 24 గంటల్లో 16 డిగ్రీల గరిష్ఠ, 7.6 డిగ్రీల కనిష్ఠంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఉత్తరాది పలు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయాయి. జీరో విజిబిలిటీతో సమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. మరికొన్ని రోజులు చలి తీవ్రత ఉంటుందని ఐఎండీ ప్రకటించింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోవడంతో ఈనెల 8 వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచన వేస్తుంది. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. బిహార్, పంజాబ్, రాజస్థాన్ హరియాణాలోనూ దట్టంగా మంచు కురుస్తుంది. చలిగాలుల దృష్యా నోయిడాలో 8వ తరగతి వరకు విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించారు. రాజస్థాన్ లోని ఫతేపుర్ లో గత 24 గంటల్లో 3.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.