calender_icon.png 26 December, 2024 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని ఆర్డీవో ఆఫీసులో కోల్డ్‌వార్!

18-09-2024 04:08:32 AM

  1. ఆర్డీవో, డీఏవో ఎడమొఖం, పెడమొఖం 
  2. ఒకరు ఉంటే మరొకరు ఉండరు 
  3. మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి పంచాయితీ

మంథని, సెప్టెంబర్ 17: మంథనిలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ఆర్డీవో హనుమనాయక్, డివిజనల్ పరిపాలన అధికారి (డీఏవో) తూ ము రవీందర్ పటేల్ మధ్య కొనసాగుతున్న ప్రచ్చన్న యద్ధంతో రైతు సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. కార్యాలయం పని వేళలో ఎవరు ముందుగా విధులకు హాజరైతే ఆ రోజు సదరు అధికారి మా త్రమే రైతులకు అందుబాటులో ఉంటారు. ఆలస్యంగా వచ్చిన రెండో అధికారి ఏదొక పని మీద క్షేత్ర స్థాయికి వెళ్లడం తరచుగా జరుగుతుండటంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి న నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ ంలో భాగంగా మంథని డివిజన్‌లో భూసేకరణ పనులను వేగవంతం చేయాలని పై అ ధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. వీరిద్ద రి మధ్య సయోధ్య లేక చాలా రోజులుగా ఆ పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఈ కారణంగానే ఆలస్యంగా జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

భూ నిర్వాసితుల సమస్యల కోసం వచ్చేవారు వీరి పంచాయితీ చూసి తలలు పట్టుకుంటున్నారు. అన్ని తెలిసిన ఉన్నతాధికారులే ఈ విధంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తున్నది. ఇదివరకే జిల్లా కలెక్టర్ దృష్టికి వీరి కోల్డ్‌వార్ వెళ్లిది. అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. చివరకు వారి పంచాయితీ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు వద్దకు చేరడంతో మంథనిలో హాట్ టాపిక్‌గా మారింది. 

భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త 

నిజామాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నిద్రలో ఉన్న భార్య గొంతును మద్యం మత్తులో ఉన్న భర్త కొడవలితో కోసి హత్యచేశాడు. వ ర్నీ మండలం వడ్డేపల్లికి చెందిన బాల య్య, పెంటవ్వ దంపతులు. గత కొంత కాలంగా కుటుంబ కలహాల కారణం గా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న బాలయ్య.. నిద్రిస్తున్న పెంటవ్వ గొంతుకోసి చంపాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసి ంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్నీ ఎస్సై కృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.