ఉప ఎన్నికల్లో ఓటమితో పరస్పర విమర్శలు
బెంగళూరు, నవంబర్ 29: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు పార్టీలో అంతర్గత సమస్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిం చుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్త లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందు లో ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా, మరొకటి బసంగౌడ పా టి యత్నాల్ గ్రూప్ అని తెలుస్తోంది.
తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కారణమని యత్నాల్ పాటిల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు సీనియర్లు పార్టీలోని ఇతర నేతలను లెక్క చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశా రు. మరోవైపు.. పాటిల్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. పార్టీ హైకమాండ్ పాటిల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో బీజే పీ ఇంటిపోరు రచ్చకెక్కింది.