calender_icon.png 12 March, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికుల కోసం చలివేంద్రాలు

12-03-2025 12:17:36 AM

భీమదేవరపల్లి, మార్చి 11:  సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, కొత్తకొండ గ్రామా ల్లో వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మంగళవారం ప్రారంభించారు.

చల్లని  నీరు అందజేసేందుకు వాటర్ కూలర్లను కూడా అందజేశారు.  కార్యక్రమం లో బీజేపీ నాయకులు దొంగల కొమురయ్య, మాచర్ల కుమారస్వామి, పృథ్వీరాజ్, శ్రీరామోజీ శ్రీనివాస్, శివ సాగర్, సాయితేజ్ , శ్యామ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.