calender_icon.png 20 April, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కేంద్రాల్లో చలివేంద్రాలు

17-04-2025 02:00:32 AM

టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు 

ప్రారంభించిన చండూర్ పీఏసీఎస్ చైర్మన్ సుష్మవెంకన్న

మునుగోడు, ఏప్రిల్ 16: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కోడి సుష్మావెంకన్న కోరారు. కస్తాల గ్రామంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని బుధవారం మండల వ్యవసాయ అధికారి చంద్రికతో కలిసి ప్రారంభించారు.

మండలంలోని అన్ని గ్రామా ల్లోని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో చలి వేంద్రాలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలి పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్ కట్ట బిక్షం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అమరేందర్రెడ్డి, లక్ష్మీ, ఫణి, ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి వెంకట్రెడ్డి, నరేందర్రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.