21-04-2025 01:43:45 AM
కామారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున కాచాపూర్ బస్టాండ్, స్కూల్ గ్రౌండ్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో మోతే సంతోష్ రెడ్డి (MSR) చలివేంద్రాలు ఏర్పాటు చేయించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు జంగం బాలప్రకాష్, దేవాదాయ కమిటీ చైర్మన్ అకుతోటా స్వామి, ఆకుతోట శ్రీశైలం, MSR ప్రతినిధులు గొణుగోపుల సుదర్శన్, ల్యాబ్ ముదాం శ్రీధర్ పటేల్. గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం అభినంద నియమని గ్రామస్తులు తెలిపారు.