జిల్లాలో 11.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మెదక్, నవంబర్ 21(విజయక్రాంతి): మెదక్ జిల్లా చలితో వణికిపోతుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటం, శీతలగాలులు వీస్తుండడంతో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. మెదక్ జిల్లాలో గురువారం 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం జిల్లాలోని శివ్వంపేటలో నమోదైన 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత చలితీవ్రతను స్పష్టం చేస్తోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుండటంతో వృద్ధులు, చిన్నారులు తీవ్రఇబ్బందులు గురవుతున్నారు. ఉదయం వేళల్లో రహదారులు పొగమంచుతో కమ్ముకుంటున్నాయి. వాహనదారు లకు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఆలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధ వ్యాధు లు ప్రబలే ప్రమాదముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వచ్చిన తర్వాతే బయటకు రావాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.