calender_icon.png 31 January, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్ష్వాకుల కాలం నాటి నాణేలు

29-01-2025 12:00:00 AM

ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధక్షేత్రాల్లో ఫణిగిరి క్షేత్రం ఒకటి. ఇది సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ఉంది. అమరావతి, నాగార్జునకొండ బౌద్ధక్షేత్రాల కంటే ఈ క్షేత్రం గొప్పదంటారు. ఇక్కడ ఇక్ష్వాకులు 11 ఏళ్లు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల బౌద్ధ క్షేత్రంలో తవ్వకాలు జరపగా ఓ కుండ బయటపడింది. అందులో 3,730 సీసపు నాణేలు ఉన్నాయి.

దానికి సమీపంలోనే గాజు నమూనాలు, స్త్రీలు ధరించే నగల ఆకృతులు, అప్పట్లో పిల్లలు ఆడుకునే బండి చక్రం వంటివి లభ్యమయ్యాయి. ఆ సీసపు నాణేలు ఇక్ష్వాకుల కాలం నాటివిగా గుర్తించారు. ఒకేచోట ఇంత పెద్ద మొత్తంలో నాణేలు దొరకడం దేశంలోనే మొదటిసారి చరిత్రకారులు చెబుతున్నారు.

అంతేకాదు.. ఈ తవ్వకాల్లో మహా స్తూపం, చైతన్య గుహలు, స్థూపాలు, గృహలు, శిలా మండపాలు, బుద్ధుడి పాదాలు, బుద్ధడి ప్రతిమలు, పాత్రలు, చిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ గౌతమి జీవిత కథలు, అపురూపంగా మల్చిన శిల్పాలు బయటపడ్డాయి.