హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) హైదరాబాద్‌లో విద్యార్థులకు, పరిశోధకులకు మైక్రోస్కోపీ సాంకేతి కత ద్వారా అసాధారణ సాధనాల ను అందించేందుకు ఐఐటీ హైదరాబాద్, నికాన్ ఇండి యా సంయుక్త ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ) తొలి సెం టర్‌ను సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శౌర్య దత్త గుప్త మాట్లాడుతూ.. ఈ కేంద్రాన్ని అత్యాధునిక ఇమేజింగ్ సాంకేతికతతో రూపొందించామని అన్నారు. బయో లాజికల్ వ్యవస్థలను వివిధ స్థాయిల్లో పరిశోధించడానికి పరిశోధకులకు అవకాశం కల్పిస్తుందన్నారు. సెల్ స్థాయి నుం చి మానవ కణజాలాల వరకూ విప్లవాత్మక పరిష్కారాలను సాధించడానికి కీలక కేంద్రం గా పని చేస్తుందన్నారు.
ఎఎక్స్ ఆర్ పాయింట్ స్కానింగ్ కాన్ఫోకల్ సిస్టమ్, ఎన్‌ఎస్‌పీఏఆర్‌సీ సూపర్ రెజల్యూషన్, టీఐఆర్‌ఎఫ్ ఇమేజింగ్ సామర్థ్యాలతో ఈ కేంద్రం ఉంటుందన్నారు. నికాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అత్యాధునిక మైక్రోస్కోపీ వ్యవస్థలను అందించగలగడం గర్వకారణంగా భావిస్తున్నట్టు తెలి పారు.
ఈ కేంద్రం ద్వారా శాస్త్రీయ పరిశోధనలను అభివృద్ధి చేయడంతో పాటు శాస్త్రవేత్తల ను, విద్యార్థులను విభిన్న రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫె సర్ బీఎస్ మూర్తి, నికాన్ ఇండియా ప్రతినిధులు అకి వకామియా, కజుకట వాటామాహే, డెబ్ శేఖర్, మహావీర్ తన్వార్ తదితరులు పాల్గొన్నారు.