05-04-2025 01:44:29 PM
44వ జాతీయ రహదారిపై ఘటన
తప్పిన పెను ప్రమాదం
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం కొబ్బరి బొండాల లోడ్ తో వస్తున్న వాహనం బోల్తా పడింది. అధిక లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పగిలిపోవడంతో వాహనం బోల్తా కొట్టిందని సదాశివనగర్ ఎస్ఐ తెలిపారు. స్థానికులు పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం(Sadashivanagar Mandal) సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వద్ద శనివారం ఉదయం రాజమండ్రి నుంచి కొబ్బరికాయలు లోడుతో నిజాంబాద్ వైపుగా వెళ్తున్న టాటా ఏస్ వాహనం టైర్ ఫంక్ష ర్ కావడంతో బోల్తా పడింది. సదాశివనగర్ 44వ జాతీయ రహదారిపై టైర్ పగిలిపోవడంతో బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేద ని తెలిపారు. వాహన పల్టీ కొట్టిన సమయంలో డ్రైవర్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారని వారు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.