ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్ అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తోంది. గ్రాస్ కోర్టుపై ఎదురులేకుండా సాగుతున్న గాఫ్ మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్‌లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిని కేవలం రెండు సెట్లలోనే మట్టికరిపించిన కోకో గాఫ్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ జోరు కొనసాగిస్తూ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. డానిల్ మెద్వెదెవ్ ముందంజ వేయగా.. 8వ సీడ్ కాస్పర్ రూడ్ రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టాడు.
లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో అమెరికా సంచలనం కోకో గాఫ్ అద్వితీయ ఆటతో దూసుకెళ్తోంది. బుధవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో గాఫ్ 6 6 క్వాలిఫయర్ అంకా టడోనీ (రొమేనియా)ను చిత్తు చేసి మూడో రౌండ్‌కు చేరుకుంది. గంటకు పైగా సాగిన పోరులో గాఫ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో 2 ఏస్‌లు, 13 విన్నర్లు సంధించిన గాఫ్ 13 అనవసర తప్పిదాలు చేసింది. టడోనీ 23 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో సొనాయ్ కర్టల్ 6 5 6 క్లారా బ్యూరెల్‌పై, బియాంకా ఆండ్రెస్క్యూ 6 7 (7/5)తో లిండా నొస్కోవాపై విజయాలు సాధించారు.
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో మూడో సీడ్ అల్కరాజ్ 7 (7/5), 6 6 అలెగ్సాండర్ వుకిక్‌పై విజయం సాధించాడు. గంటా 48 నిమిషాల పాటు సాగిన పోరులో 11 ఏస్‌లు కొట్టిన అల్కరాజ్ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచాడు. 42 విన్నర్లు సంధించిన డిఫెండింగ్ చాంపియన్ 15వ అనవసర తప్పిదాలు చేశాడు.
ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ మెద్వెదెవ్ 6 (3/7), 7 (7/4), 6 7 అలెగ్జాండర్ ముల్లర్‌పై, కచనోవ్ 6 6 (4/7), 7 (13/11), 2 కరత్సేవ్‌పై విజయం సాధించాడు. 8వ సీడ్ కాస్పర్ రూడ్ 4 5 7 (7/1), 3 ఫొనిని చేతిలో ఓడి రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టాడు. భారత యువ ఆటగాడు సుమిత్ నాగల్ డబుల్స్‌లోనూ ఆకట్టుకోలేకపోగా.. సీనియర్ ప్లేయర్ బోపన్న జంట రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.