03-03-2025 12:56:36 AM
దర్శక, నిర్మాతగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు రమేశ్ వర్మ. తాజాగా ఆయ న స్వీయ ప్రొడక్షన్ ‘ఆర్‌వీ ఫిల్మ్ హౌస్’ బ్యానర్‌పై మొదటి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘కొక్కొరోకో’ పేరు తో రూపొందుతున్న ఈ చిత్రంతో శ్రీనివాస్ వసంతల దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ప్రముఖ రచయిత జీ సత్యమూర్తి కుమారుడు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ చిత్రానికి రైటర్‌గా పనిచేస్తున్నారు. రేఖవర్మ, కూరపాటి శిరీష నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఆకాశ్ ఆర్ జోషి, మ్యూజిక్ డైరెక్టర్‌గా సంకీర్తన్, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.